తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని Bharat Rashtra Samithi తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్ధాలు, విష ప్రచారాలు, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసిందని ఆరోపించారు.
గత ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Rao పై చిల్లర ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించిందని కేటీఆర్ అన్నారు. 420 హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని విమర్శించారు. “దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్, తెలంగాణకు వచ్చింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేసి గెలిచిందని, ఓటమి వచ్చినా కుంగిపోకుండా ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ విష ప్రచారాల వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు.
రైతుబంధు అమలు చేయలేకపోయారని, రైతులకు ఎరువులు అందించలేకపోయారని, పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమలకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు పెట్టుబడిదారులపై ఒత్తిళ్లు పెరిగాయని అన్నారు.
నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో కనీసం 4000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో నిరుద్యోగుల సమస్యలపై రాహుల్ గాంధీ, A. Revanth Reddy సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“తెలంగాణ మొత్తం ఇప్పుడు ఒక ధర్నా చౌక్‌గా మారింది. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు” అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, భారీ అప్పులతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు.
“మన పోరాటం అధికారం కోసం కాదు.. తెలంగాణ కోసం” అని స్పష్టం చేసిన కేటీఆర్, తెలంగాణను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
