అమరావతి/మంగళగిరి: మెగా పవర్ స్టార్ Ram Charan గురువారం సాయంత్రం మంగళగిరిలోని Jana Sena Party కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyanను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ అమరావతికి చేరుకున్నారు. ఈ సాయంత్రం అమరావతిలోని ACA International Cricket Stadiumలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో, ముందుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిశారు.
రామ్ చరణ్ రాక సందర్భంగా జనసేన కార్యాలయం వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మెగా కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

