Thursday, May 28, 2026
HomeHyderabadNewsT20 కెప్టెన్సీలో భారీ ట్విస్ట్.. Suryakumar Out.. Shreyas Iyer In?

T20 కెప్టెన్సీలో భారీ ట్విస్ట్.. Suryakumar Out.. Shreyas Iyer In?

భారత టీ20 జట్టులో కీలక మార్పులకు BCCI సెలెక్టర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్న Suryakumar Yadavను ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త నాయకుడిగా Shreyas Iyerను నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. IPL 2026 ముగిసిన అనంతరం Ireland, England సిరీస్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేసే సమయంలో ఈ నిర్ణయం అధికారికంగా వెలువడే అవకాశముందని ప్రముఖ ఆగ్ల పత్రిక పేర్కొంది. టీ20 ఫార్మాట్‌లో Team Indiaకి కొత్త దిశ […]

భారత టీ20 జట్టులో కీలక మార్పులకు BCCI సెలెక్టర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్న Suryakumar Yadavను ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త నాయకుడిగా Shreyas Iyerను నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. IPL 2026 ముగిసిన అనంతరం Ireland, England సిరీస్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేసే సమయంలో ఈ నిర్ణయం అధికారికంగా వెలువడే అవకాశముందని ప్రముఖ ఆగ్ల పత్రిక పేర్కొంది.

టీ20 ఫార్మాట్‌లో Team Indiaకి కొత్త దిశ అవసరమని selectors భావిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా జట్టు ప్రదర్శన, captaincy వ్యూహాలు, భవిష్యత్ ప్రణాళికలపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో Shreyas Iyerకు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు BCCI ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

IPL 2026లో Shreyas Iyer అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించినట్లు cricket experts అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ జట్టును సమర్థంగా నడిపించడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, కీలక మ్యాచ్‌లను చాకచక్యంగా ముగించడం వంటి అంశాలు selectorsను ఆకట్టుకున్నాయని సమాచారం. భవిష్యత్ T20 World Cupను దృష్టిలో పెట్టుకొని స్థిరమైన కెప్టెన్‌ను తయారుచేయాలనే ఆలోచనలో BCCI ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక Suryakumar Yadav విషయానికి వస్తే, అతని batting performanceపై ఎలాంటి సందేహాలు లేకపోయినా, captaincy పరంగా ఆశించిన స్థాయి ప్రభావం చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే BCCI నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Ireland, England సిరీస్‌లకు ఎంపికయ్యే Team Indiaపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్‌గా Shreyas Iyer పేరు ముందుకు రావడం cricket circlesలో పెద్ద చర్చకు దారితీసింది.

BCCI Plans Major T20I Captaincy Change, Shreyas Iyer Likely to Replace Suryakumar

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories