Tuesday, April 21, 2026
HomeCinemaగాయపడ్డ సింహం లో ఫ్రెష్ ఫన్ & డార్క్ కామెడీ హైలైట్ – డైరెక్టర్ కశ్యప్...

గాయపడ్డ సింహం లో ఫ్రెష్ ఫన్ & డార్క్ కామెడీ హైలైట్ – డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్

‘గాయపడ్డ సింహం’లో ఫ్రెష్ ఫన్ & డార్క్ కామెడీ హైలైట్ – ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ గ్యారంటీ: డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే తరుణ్ భాస్కర్, రైటర్-డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్న ఈ చిత్రం సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ […]

‘గాయపడ్డ సింహం’లో ఫ్రెష్ ఫన్ & డార్క్ కామెడీ హైలైట్ – ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ గ్యారంటీ: డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్

డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే తరుణ్ భాస్కర్, రైటర్-డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్న ఈ చిత్రం సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందింది.

ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది. ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

జర్నీ గురించి…

2010లో కాలేజీ రోజులలో షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ మొదలవ్వడంతో, మొదట నటుడిగా మారాలని భావించానని కశ్యప్ తెలిపారు. అయితే ఆడిషన్లలో తిరస్కరణలు ఎదుర్కొన్న తర్వాత, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు.

రచన, దర్శకత్వం, ఎడిటింగ్‌పై ఆసక్తి పెరిగి, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని చెప్పారు.

తరుణ్ భాస్కర్ ఎంపిక వెనుక కారణం

ఈ కథకు టిపికల్ హీరో అవసరం లేదని, హీరో పాత్ర సీరియస్‌గా ఉండాలి కానీ ఆడియన్స్‌కు నవ్వు రావాలి అనే కాన్సెప్ట్‌తో కథను రాశానన్నారు. అలాంటి పాత్రకు తరుణ్ భాస్కర్ సరైన ఎంపికగా అనిపించారని తెలిపారు.

బాలయ్య రిఫరెన్స్ ఎందుకు?

“నవ్వకు… ఇది సీరియస్ మ్యాటర్” వంటి డైలాగ్‌తో పాటు, టైటిల్‌లో ‘సింహం’ అనే పదం ఉండటంతో బాలయ్య బాబు గుర్తుకు వస్తారని చెప్పారు. అలాంటి పవర్‌ఫుల్ ఇమేజ్‌ను తరుణ్ భాస్కర్ క్యారెక్టర్‌తో కాంట్రాస్ట్‌గా చూపించడం సినిమాకి ప్రత్యేకతనిస్తుందని అన్నారు.

కథలో ఏముంది?

ఈ సినిమాలో హీరో తన ప్రేమ కోసం అమెరికా వెళ్లి, అక్కడి నుంచి డిపోర్ట్ అవ్వడం, తిరిగి ఇండియాకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత అతను తీసుకునే నిర్ణయాలు, వాటి వల్ల జరిగే ఫన్ & కామెడీ కథను ముందుకు నడిపిస్తాయి.

జేడీ చక్రవర్తి పోషించిన ‘ధర్మ’ పాత్ర అక్రమ రవాణాతో సంబంధం ఉన్నది. ఈ రెండు పాత్రలు ఎలా కలుస్తాయన్నది కథలో ప్రధాన ఆసక్తికర అంశంగా ఉంటుందని తెలిపారు.

డార్క్ కామెడీ ఎలిమెంట్స్

‘మనీ’ సినిమా తరహాలో ప్రతి పాత్ర కూడా తానే హీరో అనుకునే విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ తన సీరియస్ లైఫ్‌లో ఉంటూ, ఆడియన్స్‌కు నవ్వు తెప్పించేలా కథనం సాగుతుందని చెప్పారు.

డైరెక్టర్లతో పని అనుభవం

పవన్ సాదినేని, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులతో పని చేయడం అడ్వాంటేజ్ అయ్యిందని చెప్పారు. వారు దర్శకులుగా ఉండటం వల్ల సన్నివేశాలను త్వరగా అర్థం చేసుకుని సహకరించారని అన్నారు.

Ghaayapadda Simham Promises Fresh Fun & Dark Comedy – Kashyap Srinivas
Kashyap Srinivas

సినిమాలో ప్రత్యేకతలు
మొదటి సీన్ నుంచే కామెడీ స్టార్ట్ అవుతుంది
డైలాగ్, విజువల్, యాక్షన్, సిచ్యుయేషనల్ కామెడీ అన్నీ ఉంటాయి
శుభలేఖ సుధాకర్‌తో కేజీఎఫ్ స్టైల్ నరేషన్ ప్రత్యేక ఆకర్షణ
స్పూఫ్స్, ఇమిటేషన్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్
ట్రంప్ క్యారెక్టర్ గురించి

సినిమాలో ట్రంప్ క్యారెక్టర్ కూడా కామిక్ టచ్‌తో ఉంటుందని, కథ రాసిన తర్వాత జరిగిన పరిణామాలకు అనుగుణంగా టైమ్‌లైన్ మార్చినట్లు తెలిపారు.

హీరోయిన్స్ పాత్రలు

మానస పాత్ర వల్లే కథలో ప్రధాన సమస్య మొదలవుతుందని, ఫరియా పాత్ర ప్రస్తుత కాలంలో కీలకంగా ఉంటుందని చెప్పారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories