Tuesday, June 2, 2026
HomePodcastsHyderabad: చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి : ఇందిరాపార్క్ మహాధర్నాలో KTR

Hyderabad: చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి : ఇందిరాపార్క్ మహాధర్నాలో KTR

Hyderabad: ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (జేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుమారు 200 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్న ఈ ధర్నాలో చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ […]

Hyderabad: ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (జేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుమారు 200 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్న ఈ ధర్నాలో చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులను తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకే కేటాయించాలని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) మరియు కుటీర పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ఈఎండీ (EMD), సెక్యూరిటీ డిపాజిట్ (SD) మినహాయింపులు కల్పించాలని, చిన్న కాంట్రాక్టర్లు కూడా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలను సరళీకరించాలని డిమాండ్ చేశారు.

ప్రీ-బిడ్డింగ్ సమావేశాలకు వసూలు చేస్తున్న ఎంట్రీ ఫీజులను పూర్తిగా రద్దు చేయాలని, స్థానిక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పారదర్శకతతో పాటు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోఆపరేటివ్ సంస్థల ద్వారా కాంట్రాక్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే కూరగాయలు, పాలు, చికెన్ వంటి టెండర్లను కూడా పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

రాష్ట్రంలోని ప్రధాన కాంట్రాక్టులు కొద్దిమంది వ్యక్తులకే కట్టబెడుతున్నారని, చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులు, కాంట్రాక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

2028లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పటికి 50 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories