KCR విజన్‌తో ఏర్పడ్డ T-Works.. తెలంగాణ Innovation Powerకు Symbol
తెలంగాణలో BRS ప్రభుత్వం తీసుకొచ్చిన సాంకేతిక విప్లవానికి ప్రతీకగా నిలిచిన T-Works పై ప్రముఖ దినపత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు T-Works” అంటూ KTR చేసిన ట్వీట్ ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీస్తోంది.
T-Works అనేది కేవలం ఒక భవనం కాదని, తెలంగాణ యువత కలలకు రెక్కలు తొడిగిన ఆవిష్కరణల వేదిక అని KTR పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి KCR దూరదృష్టితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు దేశంలోనే అతిపెద్ద Prototyping Centerగా గుర్తింపు పొందిందన్నారు. Startupsకు మాటలకే పరిమితం కాకుండా world-class infrastructure, అత్యాధునిక టెక్నాలజీ, innovationకు పూర్తి స్వేచ్ఛ కల్పించిన ప్రభుత్వం BRS ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు Drones, Defence technology, electronics రంగాలపై చర్చ జరుగుతున్న సమయంలో… ఆ బీజాన్ని తెలంగాణలో ఎన్నో ఏళ్ల కిందటే నాటింది KCR నాయకత్వమని KTR స్పష్టం చేశారు. Hyderabadను Innovation Hubగా తీర్చిదిద్దడంలో T-Works కీలక పాత్ర పోషించిందన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచిన T-Works, యువ ఆవిష్కర్తలకు ఒక గొప్ప వేదికగా మారిందని KTR తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విద్యార్థులు, Startups, engineers, researchers తమ ఆలోచనలను practical productsగా మార్చుకునే అవకాశాన్ని T-Works కల్పిస్తోందన్నారు. ఒకే చోట electronics, mechanical, drone technology, robotics, 3D printing వంటి అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉండటం దేశంలోనే అరుదైన విషయమని తెలిపారు.
“Make in Telangana” అనే ఆత్మవిశ్వాసానికి T-Works నిదర్శనమని, తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలన్న KCR ఆలోచనల ఫలితమే ఈ సంస్థ అని KTR కొనియాడారు. ప్రస్తుతం national levelలో ప్రశంసలు అందుకుంటున్న T-Works విజయగాథ, తెలంగాణ అభివృద్ధి ఎంత ముందుచూపుతో సాగిందో మరోసారి నిరూపిస్తోందన్నారు.
