జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘నాగబంధం’
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రిలీజ్ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ‘వీర నాగ’ సాంగ్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ లుక్‌ను ఆవిష్కరించారు. పోస్టర్‌లో ప్రధాన పాత్ర వివిధ రుద్ర అవతారాల్లో కనిపిస్తూ, భారీ నాగులు, ఆధ్యాత్మిక శక్తులు, పురాణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేయడం విశేషం. సినిమా విజువల్ గ్రాండియర్‌కు ఈ పోస్టర్ మరో నిదర్శనంగా నిలిచింది.
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ పురాణాలు, నాగ రహస్యాలు, సాహసయాత్రల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు అద్భుతమైన విజువల్స్, హై-క్వాలిటీ VFX, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మంచి స్పందనను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘వీర నాగ’ పాట సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ఎన్‌ఐకే స్టూడియోస్ మరియు అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విజువల్ గ్రాండియర్, మైథలాజికల్ కథనం, అత్యున్నత నిర్మాణ విలువలతో ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
