Telangana: పురుషుల్లో జీర్ణ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, అదే సమయంలో జుట్టు రాలుదల సమస్యలు కూడా పెరుగుతున్నాయని దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో హెయిర్ లాస్ పరిష్కారాల్లో ప్రముఖ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన Traya Health నిర్వహించిన “గట్-హెయిర్ హెల్త్ స్టడీ”లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2024 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు దేశంలోని పది ప్రధాన రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన 1.6 లక్షలకుపైగా భారతీయ పురుషుల స్వీయ ఆరోగ్య వివరాలను పరిశీలించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో జీర్ణక్రియ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి “మలబద్ధకం లేకపోవడం లేదా తక్కువగా ఉండడం”ను ప్రధాన సూచికగా తీసుకున్నారు. జీర్ణ ఆరోగ్యం మరియు జుట్టు రాలుదల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
అధ్యయనం ప్రకారం తెలంగాణలో ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ఉందని తెలిపిన పురుషుల శాతం 2024 డిసెంబర్‌లో 19.13 శాతంగా ఉండగా, 2025 డిసెంబర్ నాటికి అది 15.03 శాతానికి పడిపోయింది. ఏడాదిలోనే 4.10 శాతం పాయింట్ల క్షీణత నమోదై దేశంలోనే అత్యధిక తగ్గుదలగా నిలిచింది. రాజస్థాన్, ఢిల్లీ NCR, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆధునిక పట్టణ జీవనశైలి ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఐటీ, సర్వీసెస్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు అసమయ భోజనాలు, ఒత్తిడి, తక్కువ నిద్ర, నీరు తాగడంలో నిర్లక్ష్యం వంటి అలవాట్లకు గురవుతున్నారు. అదేవిధంగా 10 నిమిషాల ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం సులభంగా అందుబాటులోకి రావడం కూడా జీర్ణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని త్రాయ హెల్త్ విశ్లేషించింది.
జీర్ణక్రియ బలహీనపడితే శరీరానికి అవసరమైన పోషకాలు సరైన విధంగా శోషించబడవు. జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు వంటి పోషకాలు ముందుగా పేగుల ద్వారా శరీరంలోకి చేరాలి. కానీ గట్ హెల్త్ దెబ్బతింటే ఈ పోషకాలు శరీరంలోని ముఖ్య అవయవాలకు మళ్లించబడతాయి. ఫలితంగా జుట్టు మూలాలకు తగిన పోషణ అందక హెయిర్ ఫాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే జీర్ణ వ్యవస్థ బలహీనమైతే శరీరంలో అంతర్గత వాపు (ఇన్‌ఫ్లమేషన్) పెరిగి జుట్టు పెరుగుదల చక్రం దెబ్బతింటుందని అధ్యయనం పేర్కొంది. దీని కారణంగా కొత్త జుట్టు పెరుగుదల తగ్గి, పాత జుట్టు వేగంగా రాలిపోతుందని వివరించింది. ఈ సమస్యలను కేవలం షాంపూలు లేదా హెయిర్ ఆయిల్స్‌తో పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
త్రాయ హెల్త్ సహ వ్యవస్థాపకురాలు Saloni Anand మాట్లాడుతూ, “తెలంగాణ గణాంకాలు నిర్లక్ష్యం చేయలేని హెచ్చరిక. ఇవి సాధారణ ఆరోగ్య సమస్యలు కాదు; దేశంలోని అత్యంత చురుకైన పట్టణ జీవనశైలిలో పనిచేస్తున్న వృత్తిపరుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. జీర్ణక్రియ దెబ్బతింటే మొదట కనిపించే సంకేతాల్లో జుట్టు రాలుదల ఒకటి” అని పేర్కొన్నారు.
త్రాయ హెల్త్ వివరాల ప్రకారం, సంస్థ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా హెయిర్ లాస్ సమస్యలపై సేవలు అందించింది. ఆయుర్వేదం, డెర్మటాలజీ, న్యూట్రిషన్‌ను సమన్వయం చేస్తూ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సా విధానాలను రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
