
Hyderabad: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చేసిన ప్రాంతీయవాద వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా Meet The Press లో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం సాధారణంగా ఏర్పడలేదని, వేలాది మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగానే వచ్చిందని స్పష్టం చేశారు.
“తెలంగాణ ఖచ్చితంగా ఈ నేల భూమిపుత్రుల జాగీరే. ఈ నేల కోసం పోరాడినవాళ్లు, రక్తం చిందించినవాళ్లది తెలంగాణ” అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ఇతర ప్రాంతాల ప్రజలు ఉండటాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, “ఇక్కడే ఉండండి, వ్యాపారాలు చేసుకోండి, కుటుంబాలతో జీవించండి.. ఎవరు అడ్డుకున్నారు?” అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేయడం కూడా ప్రాంతీయవాదమేనా?” అంటూ కేటీఆర్ నిలదీశారు. అలాగే ప్రధాని Narendra Modi గుజరాత్‌కు పరిశ్రమలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ, “జాతీయవాదం ముసుగులో జరుగుతున్న ఆర్థిక ప్రాంతీయవాదం సరైందా?” అని ప్రశ్నించారు.
దేశభక్తి విషయంలో తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. “నిజాం వ్యతిరేక పోరాటం చేసిన నేల ఇది. కమ్యూనిస్టులు కదంతొక్కిన నేల ఇది. మాకు పోరాటాలు కొత్త కాదు” అని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా గౌరవిస్తామని, “ఒక నటుడిగా అభిమానిస్తాం.. ఇంటికి వస్తే హైదరాబాదీ బిర్యానీ పెడతాం. కానీ మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోం” అని ఘాటుగా స్పందించారు.
ఇటీవల విడుదలైన OG సినిమాను ప్రస్తావిస్తూ, “మాకు అసలైన తెలంగాణ ఓజీ మా K. Chandrashekar Rao గారే” అని అన్నారు.
జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేశారని గుర్తు చేశారు. “ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. అది రాజ్యాంగ హక్కు. కానీ ఆ ప్రాంత ప్రజల భావోద్వేగాలు, త్యాగాలు గౌరవించాలి” అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు.
