Tuesday, July 28, 2026
HomeTelangana & APతెలంగాణ నుంచి జనసేన ప్రస్థానం మరింత వేగం: Pawan Kalyan

తెలంగాణ నుంచి జనసేన ప్రస్థానం మరింత వేగం: Pawan Kalyan

హైదరాబాద్, జూన్ 19: జనసేన పార్టీ ప్రజల పార్టీగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, జనసైనికులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆత్మను, ఇక్కడి పోరాటాల స్ఫూర్తిని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. […]

హైదరాబాద్, జూన్ 19: జనసేన పార్టీ ప్రజల పార్టీగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, జనసైనికులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ఆత్మను, ఇక్కడి పోరాటాల స్ఫూర్తిని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ నేల త్యాగాలు, ఉద్యమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా జనసేన సిద్ధాంతబద్ధ రాజకీయాలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. దేశ సమగ్రత, జాతీయ ఐక్యతకు తొలి ప్రాధాన్యం ఇస్తూనే తెలంగాణ ఆశలు, అభిలాషలను ప్రతిబింబించే రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు.

పార్టీ కార్యకర్తలు ప్రజల సమస్యలను వినడంలో ఓర్పు, బాధ్యతతో వ్యవహరించాలని సూచించిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో “జనవాణి” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని నాయకులకు ఆదేశించారు. ప్రజల సమస్యలను విని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని, అవసరమైతే ప్రజా ఉద్యమాలకు కూడా సిద్ధం కావాలని అన్నారు.

పోరాటంతో పాటు ఐకమత్యం కూడా రాజకీయాల్లో కీలకమని పేర్కొన్న ఆయన, పార్టీలో కొత్తగా చేరే యువతకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. తెలంగాణలోని ప్రతి ప్రజా సమస్యపై పార్టీ నాయకులు స్పందించాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి విధానపరమైన అంశాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ గొప్ప మేధావులు, కవులు, ఉద్యమకారుల నేల అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, దాశరథి కృష్ణమాచార్యులు, చాకలి ఐలమ్మ, కాళోజీ, సర్వాయి పాపన్న వంటి మహనీయుల స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం జనసేన పనిచేస్తుందని అన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా జనసేన భావజాలం విస్తరిస్తోందని, తెలంగాణ నుంచే ప్రారంభమైన పార్టీ ప్రయాణం ఇప్పుడు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా బలోపేతమవుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, కోశాధికారి ఎ.వి. రత్నం, తెలంగాణ ఇన్‌చార్జి ఎన్. శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం తదితర నాయకులు పాల్గొన్నారు.

అనంతరం తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనకు కృషి చేయాలని సూచించారు.

Jana Sena to Telangana Journey: Pawan Kalyan

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories