Monday, June 15, 2026
HomeTelangana & APహైదరాబాద్: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద నీరు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

హైదరాబాద్: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద నీరు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌కు తాగునీటి ప్రధాన వనరులైన వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయాల నీటి మట్టాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జలాశయాలకు వస్తున్న ఇన్‌ఫ్లోలు, ప్రస్తుత నిల్వల పరిస్థితిని సాంకేతిక సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వాటర్ బోర్డు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని […]

హైదరాబాద్, జూన్ 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌కు తాగునీటి ప్రధాన వనరులైన

Hyderabad Authorities on Alert as Inflows Rise in Osman Sagar, Himayat Sagar
Hyderabad Authorities on Alert as Inflows Rise in Osman Sagar, Himayat Sagar

వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయాల నీటి మట్టాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

జలాశయాలకు వస్తున్న ఇన్‌ఫ్లోలు, ప్రస్తుత నిల్వల పరిస్థితిని సాంకేతిక సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వాటర్ బోర్డు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.

జలాశయాలకు వరద నీరు చేరుతున్న నేపథ్యంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు, హైడ్రా (HYDRAA)తో పాటు ఇతర పౌర సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

జలాశయాల గేట్ల నిర్వహణ, నీటి విడుదల లేదా ఇతర అత్యవసర చర్యలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అధికారిక ప్రకటనల ద్వారా ప్రజలకు ముందుగానే సమాచారం అందజేస్తామని వాటర్ బోర్డు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ జలాశయాల పరిస్థితిని సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అశోక్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖలు సిద్ధంగా ఉండి పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జూన్ 14 ఉదయం 6 గంటల నాటికి జలాశయాల నీటి మట్టాలు:

ఉస్మాన్ సాగర్

  • పూర్తి స్థాయి నీటి మట్టం (FTL): 1790.00 అడుగులు (3.518 టీఎంసీలు)
  • ప్రస్తుత నీటి మట్టం: 1784.30 అడుగులు (2.493 టీఎంసీలు)

హిమాయత్ సాగర్

  • పూర్తి స్థాయి నీటి మట్టం (FTL): 1763.50 అడుగులు (2.521 టీఎంసీలు)
  • ప్రస్తుత నీటి మట్టం: 1760.60 అడుగులు (2.110 టీఎంసీలు)

ప్రస్తుత ఇన్‌ఫ్లో: 800 క్యూసెక్కులు.

Hyderabad Authorities on Alert as Inflows Rise in Osman Sagar, Himayat Sagar

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories