Thursday, June 11, 2026
HomeHyderabadసాఫ్ట్‌వేర్ ఉద్యోగి వేషంలో కుకట్‌పల్లి DCP .. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ అక్రమాలు వెలుగులోకి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వేషంలో కుకట్‌పల్లి DCP .. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ అక్రమాలు వెలుగులోకి

Hyderabad: నగరంలోని పబ్‌లు, నైట్‌లైఫ్ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు కుకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ (క్లబ్ మస్తీ) పబ్ పై అర్ధరాత్రి ఆకస్మిక దాడి నిర్వహించి, వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో నలుగురు మహిళలు సహా మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 6, 7 తేదీల మధ్య రాత్రి సమయంలో కుకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఐపీఎస్, అదనపు డీసీపీ షమీర్, డీఐ […]

Hyderabad: నగరంలోని పబ్‌లు, నైట్‌లైఫ్ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు కుకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ (క్లబ్ మస్తీ) పబ్ పై అర్ధరాత్రి ఆకస్మిక దాడి నిర్వహించి, వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో నలుగురు మహిళలు సహా మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 6, 7 తేదీల మధ్య రాత్రి సమయంలో కుకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఐపీఎస్, అదనపు డీసీపీ షమీర్, డీఐ కె.ఎస్. రవి మరియు సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసీపీ స్వయంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వేషంలో పబ్‌లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించినట్లు సమాచారం.

సమాచారం ధృవీకరించిన అనంతరం ఆమె సంకేతంతో పోలీసు బృందాలు పబ్‌లోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పబ్ యాజమాన్యం వ్యభిచార కార్యకలాపాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు, మహిళలను వినియోగించి పురుష కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే మద్యం విక్రయించే ప్రదేశంలో మైనర్లు ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోకపోవడం, అనుమతించిన సమయాలకు మించి పబ్ నిర్వహించడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం, ఆహారం అందించడం, చెల్లుబాటు అయ్యే పోలీసు ఎన్‌ఓసీ లేకుండానే కార్యకలాపాలు కొనసాగించడం వంటి పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

దాడి అనంతరం పబ్‌లో పనిచేస్తున్న నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు కలిపి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రాథమిక విచారణలో పబ్ యజమాని మహిళలను ఉపయోగించి పురుష కస్టమర్లను ఆకర్షించి అధిక బిల్లులు వేయించడం ద్వారా అక్రమ లాభాలు పొందుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా కస్టమర్ల కోసం మహిళలను సమకూర్చడం, అనైతిక కార్యకలాపాలకు అవకాశం కల్పించడం వంటి ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ పబ్‌పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. 2025 సంవత్సరంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో మూడు వేర్వేరు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ యాజమాన్యం తన తీరు మార్చుకోలేదని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు క్రైం నంబర్ 716/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 223, 292, 318(4)తో పాటు 3(5), అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ (పీఐటీ) చట్టంలోని 5, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పబ్ యాజమాన్యం మహిళలను వినియోగించి కస్టమర్లను ఆకర్షించడం, అనైతిక కార్యకలాపాలకు సహకరించడం వంటి అంశాలపై ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరెవరు ఉన్నారు, నెట్‌వర్క్ ఎంత విస్తరించి ఉంది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పబ్‌లు, బార్లు, వినోద కేంద్రాలపై ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories